మెట్రోలో లగేజీకి టికెట్..సోషల్ మీడియాలో ప్రయాణికుడి ఆవేదన

by Ajay Maddhiboyina |

మెట్రోలో లగేజీకి సైతం బిల్ వేశారు అంటూ ఓ ప్రయాణికుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బెంగుళూరు మెట్రో దేశంలోనే అత్యంత ఖరీదైనది అంటూ విమర్శించాడు. అవినాష్ చంచల్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.

మెట్రోలో లగేజీకి టికెట్..సోషల్ మీడియాలో ప్రయాణికుడి ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: మెట్రోలో లగేజీకి సైతం బిల్ వేశారు అంటూ ఓ ప్రయాణికుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బెంగుళూరు మెట్రో దేశంలోనే అత్యంత ఖరీదైనది అంటూ విమర్శించాడు. అవినాష్ చంచల్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ప్రయాణికుడు తన పోస్టులో... ఈ బ్యాగ్ కోసం బెంగుళూరు మెట్రోలో రూ.30 టికెట్ చెల్లించాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. బెంగుళూరు మెట్రో ఇప్పటికే దేశంలోనే అత్యంత ఖరీదైనది. ఇప్పుడు భారం మరింత పెరుగుతోంది. మెట్రోను వాడకుండా ప్రజలను ఎలా దూరం చేస్తున్నారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ.. అని పోస్టులో పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ను నిన్న షేర్ చేయగా ఇప్పటికే 44వేల కంటే ఎక్కువ వ్యూవ్స్ వచ్చాయి. సాధారణంగా మెట్రోలో లగేజీ కూడా డబ్బులు చెల్లించాలని చాలా మందికి తెలియదు. ఈ పోస్ట్ పై బెంగుళూరు మెట్రో ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక ప్రయాణికుడిపై పోస్ట్ పై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 30 రూపాలయ‌ల‌కే ఇంత ర‌చ్చ చేయాలా అని కొంద‌రు అంటుంటే మ‌రికొంద‌రు బెంగుళూరు మెట్రో ప్ర‌యాణికుల ర‌క్తం తాగుతుంద‌ని మండిప‌డుతున్నారు. బ్యాగ్ స్కానర్ మెషిన్ లో స‌రిపోనంత ఎక్కువ ల‌గేజీ ఉన్న‌ప్పుడు మాత్ర‌మే మెట్రో ల‌గేజీ టికెట్ల‌ను వ‌సూలు చేస్తుంద‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే బెంగుళూరు మెట్రో స్పందించాల్సిందే.

Next Story