- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ చేస్తున్న పని తప్పు.. అక్రమ వలసదారుల అప్పగింతపై బంగ్లాదేశ్ ఆర్మీ!
బంగ్లాదేశీ అక్రమ వలసదారులను తీసుకెళ్లి బోర్డర్ గార్డ్‌కు భారత్ అప్పగిస్తోంది. ఇలా చేయడం తప్పని ఆ దేశ ఆర్మీ అంటోంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో అక్రమంగా నివశిస్తున్న బంగ్లాదేశీయులను తిరిగి వారి దేశానికి పంపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఈ విషయాన్ని హ్యాండిల్ చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరితే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని బంగ్లా ఆర్మీ అధికారి బ్రిగడీర్ జనరల్ మహమ్మద్ నజీమ్-ఉద్-దౌలా అన్నారు. బంగ్లాదేశ్ ఆర్మీలో డైరెక్టర్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ (ఎంవోడీ)గా ఉన్న ఆయన.. ప్రస్తుతానికి ఈ పరిస్థితిని బంగ్లాదేశ్ బోర్డర్ సెక్యూరిటీ దళం (బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)) సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తోందని చెప్పారు.
కొన్నిరోజులుగా భారత్‌లో అక్రమంగా నివశిస్తు్న్న బంగ్లాదేశీయులను పట్టుకొని, ఆ దేశ బీజీబీకి భారత ప్రభుత్వం అప్పగిస్తోంది. ఈ ప్రక్రియను బంగ్లా ప్రభుత్వం ‘పుష్-ఇన్’ అంటోంది. ఇలా చేయడం తగదని, కావాలంటే వారిని సరైన దౌత్య మార్గాల్లో తమ దేశానికి తిరిగి పంపాలని సూచించింది. తాము కూడా బంగ్లాదేశ్‌లో అక్రమంగా ఉంటున్న భారతీయులను దౌత్య మార్గాల ద్వారానే వెనక్కి పంపిస్తామని చెప్పింది.






