- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pak Celebrities: పాక్ సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం విధించిన కేంద్రం
తీవ్ర విమర్శలు రావడంతో 24 గంటల్లోనే మరోసారి పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లు, సెలబ్రిటీల ఖాతాలను మళ్ళీ నిషేధించింది.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లతో పాటు సెలబ్రిటీల సోషల్ మీడియా కాతాలను నిషేధించింది. ఈ అకౌంట్లపై ఉన్న ఆంక్షలను బుధవారం ఎత్తివేసింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 24 గంటల్లోనే కేంద్రం మరోసారి పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెళ్లు, సెలబ్రిటీలకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లాంటి అన్ని సోషల్ మీడియా ఖాతాలను మళ్ళీ నిషేధించింది. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిది, ఫవాద్ ఖాన్, ఫహద్ ముస్తఫా, అహద్ రజా మీర్ కూడా ఉన్నారు. అయితే, పాకిస్తానీ ప్రముఖులపై నిషేధాన్ని పునరుద్ధరించడం గురించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
నిషేధం కొనసాగించాలని డిమాండ్లు
పాకిస్తాన్‌కు చెందిన కొందరు సెలబ్రిటీల సోషల్ మీడియా ప్రొఫైల్స్ భారతీయులకు కనిపిస్తున్నాయనే వార్త బుధవారం నెట్టింట వైరల్ అయింది. హనియా ఆమిర్, మహిరా ఖాన్, సబా ఖమర్, మావ్రా హొకేన్ వంటి అనేక మంది పాకిస్తానీ నటుల ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ బుధవారం అందరికీ కనిపించాయి. హమ్ టీవీ, హర్ పాల్ జియో సహా అనేక పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రొఫైల్స్ మళ్లీ అందుబాటులోకి రావడం కొందరు గమనించారు. సోషల్ మీడియా నిషేధాన్ని ప్రభుత్వం నిశ్శబ్దంగా వెనక్కి తీసుకుందనే వార్త ఒక్కసారిగా చెలరేగింది. దీంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. వారిపై నిషేధాన్ని కొనసాగించాలని డిమాండ్లు పెరిగాయి. దీంతో పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్‌లో మళ్లీ నిషేధం అమలైంది.
పెహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు పెహల్గామ్ దాడిని, ఆపరేషన్ సిందూర్ విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారనే కారణంతో భారత ప్రభుత్వం అన్ని పాకి యూట్యూబ్ ఛానెళ్లతో పాటు సెలబ్రిటీలు, అన్ని పాక్ మీడియాలపైనా నిషేధాన్ని అమలు చేసింది. వాటిలో పాక్ ప్రభుత్వ, ప్రభుత్వాధికారుల ఛానెళ్లు కూడా ఉన్నాయి.






