- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bal Thackeray: బాల్ థాక్రేకు భారతరత్న ఇవ్వాలి.. శివసేన (యూబీటీ) డిమాండ్
శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకు భారతరత్న ఇవ్వాలని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రే (Bal Thackeray)కు భారతరత్న (Barath rathna) ఇవ్వాలని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది. బాల్ థాక్రే 99వ జయంతి సందర్భంగా రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) గురువారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో కొంత మంది అర్హత లేని వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేసిందని ఆరోపించారు. దేశంలో నిజమైన హిందుత్వ బీజాలు నాటిన బాల్ థాక్రేకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. థాక్రే జయంతి శతాబ్దికి ఇంకా ఏడాది సమయం ఉందని ఈ లోపు ఆయనను పురస్కారంతో సత్కరించాలని తెలిపారు. వీర్ సావర్కర్‌కు కు కూడా భారతరత్న ఇవ్వలేకపోయారని, థాక్రేకు ఇస్తే, అది సావర్కర్‌కూ గౌరవం ఇచ్చినట్టు అవుతుందన్నారు. ముంబై సౌత్ ఎంపీ అరవింద్ సావంత్ (Aravind savanth) కూడా ఇదే డిమాండ్ చేశారు, హిందుత్వ ఆదర్శాలు అంటే ఏమిటో థాక్రే దేశానికి చూపించారన్నారు. సెంట్రల్ ముంబైలోని శివాజీ పార్క్‌లో బాల్ థాక్రే స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. హిందూ అనుకూలమని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం బాల్ థాక్రేకు వెంటనే భారతరత్న ప్రకటించాలన్నారు.






