- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో ఈడీ అధికారులపై దాడి కేసు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట ఈడీ దాడుల అనంతరం అధికారుల కార్లపై దాడి చేసిన కేసులో ఎనిమిది మందిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో 'సీఎంఆర్ఎల్' స్కామ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా బుధవారం తెల్లవారుజామున ఈడీ అధికారులు కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసం తో పాటు, మరో 11 చోట్లు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు సోదాల అనంతరం తిరిగి వెళ్తుండగా.. పెద్ద సంఖ్యలో మాజీ సీఎం నివాసానికి చేరుకున్న సీపీఐ(ఎం) నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు ఈడీ అధికారులపై, వారి వాహనాలపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో పలువురు పోలీసు అధికారులకు కూడా గాయాలయ్యాయి.
అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర పోలీస్ చీఫ్ చీఫ్ రావడ ఎ. చంద్రశేఖర్ ఈ రోజు హోంమంత్రి రమేష్ చెన్నితలను ఆయన నివాసంలో కలిశారు. ఈడీ అధికారుల బృందం పై జరిగిన దాడి, భద్రతా లోపాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసు దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని, హింసకు పాల్పడిన మరికొంతమంది నిందితులను ఇప్పటికే గుర్తించామని తెలిపారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించినట్లు పోలీస్ చీఫ్ స్పష్టం చేశారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశామని, మరికొంతమంది కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన మీడియాకు స్పష్టం చేశారు.
కేసు వివరాలు..
పినరయి విజయన్ కుమార్తె టి. వీణాకు చెందిన ఐటీ సంస్థ 'ఎక్సాలాజిక్ సొల్యూషన్స్' ప్రైవేట్ మైనింగ్ కంపెనీ 'సీఎంఆర్ఎల్' (CMRL) మధ్య జరిగిన రూ. 1.72 కోట్ల అక్రమ ద్రవ్య చలామణి (మనీ లాండరింగ్) ఆరోపణలపై ఈడీ దాడులు చేపట్టింది. కేరళ హైకోర్టు ఈ విచారణపై స్టేను తొలగించిన మరుసటి రోజే ఈడీ ఈ చర్యకు దిగింది. తిరువనంతపురం, కన్నూర్‌లతో పాటు మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. తిరువనంతపురంలోని పినరయి విజయన్ నివాసంలో సుమారు 7 గంటల పాటు సోదాలు ముగించుకుని ఈడీ అధికారులు బయటకు వస్తున్న సమయంలో, అక్కడ భారీగా మోహరించిన సీపీఐ(ఎం) కార్యకర్తలు ఈడీ వాహనాలను ముట్టడించారు. కోపంతో ఉన్న నిరసనకారులు ఈడీ అధికారుల కార్లపై రాళ్లు, ఇటుకలు, హెల్మెట్లతో దాడి చేసి విండ్‌షీల్డ్‌లను ధ్వంసం చేశారు. ఈ వాహనాల్లో మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘర్షణలను అదుపు చేసే క్రమంలో కేరళ పోలీసు అధికారి ఒకరు, అలాగే ఒక డ్రైవర్ గాయపడ్డారు






