Athishi: బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం.. ఢిల్లీ సీఎం అతిశీ

by B.Srinivas |

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఢిల్లీ సీఎం అతిశీ స్పష్టం చేశారు.

Athishi: బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం.. ఢిల్లీ సీఎం అతిశీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఢిల్లీ సీఎం అతిశీ (Athishi) స్పష్టం చేశారు. కల్కజీ స్థానం నుంచి విజయం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆదేశాన్ని అంగీకరిస్తున్నామని తెలిపారు. ఫలితాలు తమకు ఎదురుదెబ్బేనని కానీ కాషాయపార్టీపై యుద్ధం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోసారి విజయం అందించిన తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటూ ఢిల్లీ సమస్యలపై పోరాడతామని తెలిపారు. కాగా, కల్కజీ స్థానం నుంచి పోటీ చేసిన అతిశీ బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీపై విజయం సాధించారు.

ఐదుగురు మహిళలు మాత్రమే గెలుపు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. ఎన్నికల్లో మొత్తం 96 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఐదుగురు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇందులో నలుగురు బీజేపీకి చెందిన వారు ఉండగా, ఆప్ నుంచి సీఎం అతిశీ మాత్రమే గెలుపొందారు. బీజేపీ నుంచి గెలిచిన వారిలో షాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా, వజీర్ పూర్ నుంచి పూనమ్ శర్మ, నజాఫ్ గడ్ సెగ్మెంట్‌లో నీలం పెహల్వాన్, గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి శిఖా రాయ్‌లు గెలుపొందారు. కాగా, 2020లో 8 మంది మహిళలు గెలిచారు.

Next Story