- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UN: పాకిస్తాన్‌ది దుర్మార్గపు ఎజెండా: భారత రాయబారి పర్వతనేని హరీష్
మానవ హక్కుల ఉల్లంఘనలు, దేశ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదం నుంచి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్‌పై మరోమారు భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులు-సాయుధ ఘర్షణ(సీఏసీ)పై జరిగిన బహిరంగ చర్చ సందర్భంగా మాట్లాడిన భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్.. పాకిస్తాన్ తన సొంత భూభాగంలోనే చిన్నారులపై తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అనేక దారుణాలను చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది, రాజకీయ ప్రేరేపిత ప్రకటనల కోసమే అంతర్జాతీయ వేదికలను వాడుకుంటోందని అన్నారు. తద్వారా ఇస్లామాబాద్ మానవ హక్కుల ఉల్లంఘనలు, దేశ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదం నుంచి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ వేదికను స్వార్థానికి ఉపయోగించుకోవడం ద్వారా కౌన్సిల్ ఎజెండాను దుర్వినియోగం చేస్తోందన్నారు. పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిని ఏమార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ, దాని దుర్మార్గపు ఎజెండాను కొనసాగించడానికి వివిధ చర్చలలో భారత్‌పై దుష్ప్రచారం చేస్తోంది. వారి దేశంలో పిల్లలపై జరిగిన దురాగతాలను, అలాగే సీమాంతర ఉగ్రవాదం నుంచి దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను మేము తిరస్కరిస్తున్నామని హరీష్ స్పష్టం చేశారు.
పాకిస్తాన్ సరిహద్దుల్లో పిల్లలపై చేస్తున్న దురాగతాలు మాత్రమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను కూడా ప్రస్తావించిన భారత రాయబారి.. పాకిస్తాన్‌ను సీఏసీ ఎజెండాను తీవ్రంగా ఉల్లంఘించే దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ రాయబారి చేసిన తప్పుడు వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్ దాడి, ఆ దాడుల్లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్‌లోని చిన్నారులు, ముఖ్యంగా బాలికల స్కూళ్లపై జరుగుతున్న దాడుల గురించి హరీష్ ఆందోళన వ్యక్తం చేశారు.






