- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు భూమికి అత్యంత సమీపంగా '2024 PK2' గ్రహశకలం.! నాసా
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ( NASA )ప్రకారం.. '2024 PK2' అనే గ్రహశకలం ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో భూమికి అత్యంత సమీపంగా రానుంది.

X
దిశ, వెబ్ డెస్క్: నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ప్రకారం.. '2024 PK2' అనే గ్రహశకలం ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో భూమికి అత్యంత సమీపంగా రానుంది. ఈ గ్రహశకలం గంటకు 31, 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని నాసా తెలిపింది. అయితే ఈ గ్రహ శకలం '2024 PK2' అటెన్ సమూహానికి చెందిందని, దీని యొక్క సైజు దాదాపుగా విమానం అంత పరిమాణంలో ఉంటుందని నాసా తెలిపింది. ఈ గ్రహ శకలం భూమికి సమీపంలో ప్రవేశించినప్పుడు.. భూమికీ, శకలానికి మధ్య కనీస దూరం 12,79,430 కిలోమీటర్లు గా ఉండే అవకాశం ఉన్నట్లు నాసా తెలియజేసింది. కాగా ఈ గ్రహశకలం వల్ల భూమికి వచ్చే ప్రమాదమేమీ లేదని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story






