- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Asim Munir: దాడులకు పాల్పడితే దీటుగా బదులిస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ (Asim munir) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే పూర్తి సైనిక శక్తితో స్పందిస్తామని వ్యాఖ్యానించారు. బలూచిస్థాన్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాకిస్తాన్ ప్రాంతీయ శాంతిని కోరుకుంటుందని, అయితే తనను తాను రక్షించుకోవడానికి దాడులకు ఏ మాత్రం వెనుకాడబోదని స్పష్టం చేశారు. తమ దేశ ప్రాదేశిక సమగ్రతకు ప్రమాదం వాటిల్లితే పూర్తి శక్తితో స్పందిస్తుందన్నారు. భారత్ చేసే ఏ సైనిక చర్యకైనా వేగంగా ప్రతిస్పందిస్తామన్నారు. దాడులకు దీటుగా బదులిస్తామన్నారు. జాతీయ ప్రయోజనాలకు కాపాడుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. పాకిస్తాన్ ప్రజల పూర్తి మద్దతుతో సాయుధ దళాలు బలూచిస్థాన్ ఉగ్రవాదులపై పోరాడుతూనే ఉంటాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య వివాదం నెలకొన్న వేళ అసీమ్ మునీర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.






