అమాయక ప్రజలను చంపితే ఊరుకోరు.. పాకిస్థాన్‌కు ఓవైసీ వార్నింగ్

by Ajay Maddhiboyina |

అమాయక ప్రజలను చంపితే దేశం ఊరుకోదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మహరాష్ట్రలోని ఓ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.

అమాయక ప్రజలను చంపితే ఊరుకోరు.. పాకిస్థాన్‌కు ఓవైసీ వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: అమాయక ప్రజలను చంపితే దేశం ఊరుకోదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మహరాష్ట్రలోని ఓ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ ఎప్పుడూ అణ్వస్త్రశక్తి గురించి మాట్లాడుతుందని ఒకదేశంలోకి ప్రవేశించి ఆ దేశ ప్రజలను చంపితే మౌనంగా కూర్చోరని అది గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ఏదైనా సరే మన భూమిపై మన ప్రజలను చంపి, మతం ఆధారంగా వారిని లక్ష్యంగా చేసుకుని దేని గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఐఎస్ఐఎస్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం అయితే కశ్మీరీ ప్రజలు కూడా మన దేశంలో అంతర్భాగమేనని మోడీకి చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. మనం కశ్మీరీ ప్రజలను అవమానించకూడదని హితవు పలికారు.

Next Story