- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా వ్యాఖ్యలను ఖండించరే..? మోడీ సర్కారుపై ఓవైసీ ఫైర్
by Phanindra |
భారత్-పాక్ మధ్య మీడియేషన్ చేశామన్న చైనా వ్యాఖ్యలను ఖండించరే..? అంటూ మోడీ సర్కారుపై ఓవైసీ ఫైర్ అయ్యారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య తాము మధ్యవర్తిత్వం చేశామని చైనా మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన ఓవైసీ.. పాక్‌కు 81 శాతం ఆయుధాలు చైనా నుంచే వస్తాయని, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా రియల్-టైం ఇంటెలిజెన్స్ సహకారం అందించిందని గుర్తుచేశారు. అలాంటి దేశం ఇప్పుడు మధ్యవర్తిత్వం చేశామంటూ ప్రకటనలు చేస్తుంటే మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండటమేంటని నిలదీశారు. ఈ వ్యాఖ్యలను అధికారికంగా భారత ప్రభుత్వం ఖండించాలని డిమాండ్ చేశారు. భారత సార్వభౌమత్వాన్ని తాకట్టుపెట్టి చైనాతో సంబంధాలు మెరుగుపరచుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. అదే సమయంలో మధ్యప్రదేశ్‌లో కలుషిత నీరు తాగి ప్రజలు మరణించడంపై కూడా ఓవైసీ ఆవేదన వ్యక్తంచేశారు.
Next Story






