- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం చెప్పాలి..ఆపరేషన్ సింధూర్ పై ఓవైసీ రియాక్షన్ ఇదే
భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఇప్పటికే 50 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఇప్పటికే 50 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ మిస్సైల్ దాడులను ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. మరోవైపు బార్డర్ వద్ద పాకిస్థాన్ సైన్యం ఇండియా సైన్యం మధ్య కాల్పులు జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్ లో ప్రజలు బంకర్లలోకి వెళ్లి ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తున్నారు.
తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేధికగా స్పందించారు. పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేయడాన్ని, టెర్రరిస్టు క్యాంపులపై దాడులు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అభిప్రాయపడ్డారు. పహల్గామ్ లాంటి ఘటనలు మళ్లీ దేశంలో జరగకుండా పాకిస్థాన్‌కు బుధ్ది చెప్పాలని, పాక్ ఉగ్రవాద శిభిరాలను పూర్తిగా నాశనం చేయాలి..జై హింద్ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.






