Asaduddin Owaisi: బుల్డోజర్ రాజకీయాలపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2022-06-14 10:55:55  IST  )

Asaduddin Owaisi Fires On Bulldozer Politics of UP Government | బీజేపీ తీరుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలను కావాలనే వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi Fires On Bulldozer Politics of UP Government
X

దిశ, వెబ్‌డెస్క్: Asaduddin Owaisi Fires On Bulldozer Politics of UP Government | బీజేపీ తీరుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలను కావాలనే వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో చట్టాలను తుంగలోకి తొక్కి సీఎం ఓ సూపర్ చీఫ్ జస్టిస్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు నోటీసులు ఇచ్చి ఇండ్లను కూల్చివేస్తున్నారని అన్నారు. నిరసనకారులపై పోలీసులు లాఠీలతో కొడితే.. అది రిటర్న్ గిఫ్ట్ అని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారం పోలీసులు నడుచుకోవడం లేదని ఫైర్ అయ్యారు. యూపీలో బుల్డోజర్ల రాజకీయం తీవ్ర దుమారమే రేపుతోంది. ఈ అంశంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు మాజీ జడ్జీలు, హైకోర్టు మాజీ జడ్జీలు లేఖ రాయటం సంచలనం రేవుతోంది. యోగి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. కానీ ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రబుల్డోజర్ రాజకీయం.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలుగ్ రాజ్ లో ఆందోళనలను చేపట్టిన ఓ వర్గం వారిని మాత్రం లక్ష్యంగా చేసుకున్నారని బీఎస్పీ చీఫ్ మాయవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని, భయానక వాతావరణం సృష్టించడం ద్వారా వ్యతిరేకతను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ దుర్మార్గపు చర్యలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story