మోహన్ భగవత్ ముగ్గురు పిల్లల వ్యాఖ్యలపై ఓవైసీ కౌంటర్

by Ajay Maddhiboyina |

భారతీయులు ముగ్గురు పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

మోహన్ భగవత్ ముగ్గురు పిల్లల వ్యాఖ్యలపై ఓవైసీ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయులు ముగ్గురు పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క క్లాసిక్ ద్వంద్వ ప్రసంగం అని అన్నారు. ప్రజల కుటుంబ జీవితాల్లోకి ప్రవేశించడానికి మీరు ఎవరు అని ప్రశ్నించారు. వారి స్వేచ్ఛ, ప్రధాన్యతలు భిన్నంగా ఉంటాయని మహిళలపై ఎందుకు భారం మోపడానికి ప్రయత్నిస్తున్నారని అడిగారు. 2011 జనాభా లెక్కల డేటాను చూపిస్తూ ముస్లిం జనాభా వృద్ధి రేటు ఇప్ప‌టికే త‌గ్గుతుంద‌ని చెప్పారు.

దాదాపు 80 శాతం హిందువుల‌తో పోలిస్తే ముస్లీంల వృద్ధి రేటు 14.23 శాతంగా ఉంద‌ని తెలిపారు. ఆర్ఎస్ఎస్ మ‌రియు అనుబంధ సంస్థ‌లు ద్వేషాన్ని వ్యాప్తింప‌జేస్తున్నాయ‌ని ఆరోపించారు. ముస్లీంల‌పై ద్వేషాన్ని శాశ్వ‌తంగా పెంచడం ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ‌ల ల‌క్ష్యం అని అన్నారు. మోహ‌న్ భ‌గ‌వ‌త్ ముస్లింల‌ను చోరి కా స‌మాన్, మొఘల్ బాద్షా కీ ఔలాద్ అని పిలిచార‌ని, త‌మ సంస్థ ఎవ‌రిపైనా మ‌త‌ప‌ర‌మైన‌ దాడి చేయ‌ద‌ని చెబుతున్నార‌ని విమర్శించారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీని ప్ర‌జ‌లు త‌రిమికొట్టాల‌ని పిలుపునిచ్చారు.

Next Story