- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: ఓవైసీ
ఏదైనా నేరం రుజువై 30 రోజులు జైలులో ఉంటే పదవి నుండి తప్పించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏదైనా నేరం రుజువై 30 రోజులు జైలులో ఉంటే పదవి నుండి తప్పించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. లోక్ సభ సమావేశం తరవాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రులను, మంత్రులను తొలగించాలనే కుట్రతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ఈ బిల్లు రాజ్యంగా విరుద్దమని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఈ చట్టం ద్వారా పోలీసు రాజ్యంగా మార్చాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే కేంద్రం నేడు లోక్ సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. ఎంఐఎంతో పాటు ఇతర పార్టీల నాయకులు సైతం జైలుకు వెళితే పదివి రద్దు చేయాలనే బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో లోక్ సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష ఎంపీలు అమిత్ షాపై పేపర్లు చింపి విసిరేశారు.






