వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఓవైసీ

by Ajay Maddhiboyina |

మతపరమైన, దాతృత్వ ప్రయోజనాల కోసం ఆస్తిని అంకితం చేయాలనుకునే వారికి, ఇటీవల ఇస్లాం మతంలోకి మారిన వారిపై ఈ చట్టం వివక్ష చూపుతుందని జావేద్ పేర్కొన్నారు.

వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఓవైసీ
X

- పలు రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘించారు

- మతపరమైన హక్కులకు కూడా భంగం కలుగుతోంది

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ సుప్రీంలో పిటిషన్ వేశారు. తాజాగా ఓవైసీపీ కూడా అత్యున్నత న్యాయస్థానం ముందు పిటిషన్ దాఖలు చేశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్దమని, ముస్లిం సమాజానికి సంబంధించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని ఓవైసీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓవైసీ గతంలో వక్ఫ్ సవరణ బిల్లుల కాపీలను లోక్‌సభలోనే చించి వేశారు. బిల్లు ఓటింగ్‌కు వచ్చిన బుధవారం రోజు కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ముస్లింల విశ్వాసం, మతపరమైన ఆచారాలపై దాడి అని అభివర్ణించారు. లోక్‌సభలో బిల్లు ప్రతులను చించివేయడాన్ని మహాత్మా గాంధీ అన్యాయమైన చట్టాలను ధిక్కచించడంతో పోల్చారు. ఇక ఎంపీ జావేద్ దాఖలు చేసిన పిటిషన్‌లో.. ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 29, 300ఏలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. సమానత్వం, మత స్వేచ్ఛ, మైనార్టీ హక్కుల రక్షణ, ఆస్తి హక్కు వంటి వాటికి ఆ చట్టంతో భద్రత లభిస్తుంది. కానీ ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయడంతో ఇన్నీ వారికి దూరమవుతాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మతపరమైన, దాతృత్వ ప్రయోజనాల కోసం ఆస్తిని అంకితం చేయాలనుకునే వారికి, ఇటీవల ఇస్లాం మతంలోకి మారిన వారిపై ఈ చట్టం వివక్ష చూపుతుందని జావేద్ పేర్కొన్నారు. ఆర్టికల్ 15 ప్రకారం సమానత్వం, విక్షత లేని హక్కును ఇది ఉల్లంఘిస్తుందని అన్నారు. వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కూర్పులో ప్రతిపాదిత మార్పులపై కూడా జావెద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో ముస్లిమేతర సభ్యులు కూడా ఉంటారు. ఇది మతపరమైన పరిపాలనలో జోక్యం చేసుకుంటుందని అన్నారు. హిందువుల నిర్వహణలో ఉన్న హిందూ మత సంస్థల్లో ఇటాంటి జోక్యం లేదని ఆయన గుర్తు చేశారు.

Next Story