Kashmir: కశ్మీర్ అంశంపై పాక్ విదేశాంగశాఖ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

ప్రపంచం ఎదుట తమ దేశం ఎదుర్కొన్న పరాభవాల గురించి పాక్ విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kashmir: కశ్మీర్ అంశంపై పాక్ విదేశాంగశాఖ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచం ఎదుట తమ దేశం ఎదుర్కొన్న పరాభవాల గురించి పాక్ విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ పై భారత్ తరహాలోనే పాక్ కూడా భుట్టో ఆధ్వర్యంలో ఓ ఎంపీల బృందాన్ని ఏర్పాటు చేసింది. కాగా.. వారందరూ అమెరికా పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగానే న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భుట్టో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..‘‘కశ్మీర్‌ అంశానికి సంబంధించి పాక్ అడ్డంకులు ఇప్పటికీ ఎదుర్కొంటోంది.అంతర్జాతీయ వేదికలపైనా మాకు పరాభవాలు ఎదురయ్యాయి. రెండు అణు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి ఓ వ్యవస్థను తీసుకురావడం అసాధ్యం. మా రెండు దేశాలకు చెందిన నిఘాసంస్థలు ఐఎస్‌ఐ, రా.. కలిసి కూర్చొని, ఈ ఉగ్రవాద శక్తులపై పోరాటం కోసం కలిసి పనిచేస్తే, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిపోతాయని నేను భావిస్తున్నాను’’ అని సంచలన వ్యాఖ్యలు.

ఆశ్చర్యకర కామెంట్స్

అంతేకాకుండా, ఇరుదేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణ వల్ల ఉగ్రవాద శక్తులు బలోపేతం అవుతాయని భుట్టో ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ తన దేశం గురించి ఆయన వాస్తవాలు బయటపెట్టారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు సంబంధాలు నిజమేనంటూ ఇటీవల వెల్లడించారు. దాన్ని వల్ల గుణపాఠాలు నేర్చుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా.. భుట్టో నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం న్యూయార్క్ చేరుకుంది. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారెస్ సహా పలువురితో భేటీ అయ్యారు. యూఎన్ భద్రతా మండలిలోని మరో నాలుగు శాశ్వత సభ్యులు అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు.

Next Story