Arvind Kejriwal: మెడిటేషన్ కోసం భారీ కాన్వాయ్ తో పంజాబ్ కు కేజ్రీవాల్

by Shamantha N |

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పంజాబ్ వెళ్లిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Arvind Kejriwal: మెడిటేషన్ కోసం భారీ కాన్వాయ్ తో పంజాబ్ కు కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పంజాబ్ వెళ్లిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడిటేషన్ కోసం భారీ కాన్వాయ్, భద్రత మధ్య పంజాబ్ చేరుకున్నారు. హోషియార్‌పూర్‌లోని విపాసన కేంద్రంలో బుధవారం నుంచి పది రోజులు కొనసాగే మెడిటేషన్‌ కోర్సులో భార్యతో కలిసి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేజ్రీవాల్‌ ఇలా భారీ హంగామాతో పంజాబ్‌కు వెళ్లడంపై బీజేపీ సహా పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేజ్రీవాల్ భద్రతను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెక్యూరితో పోలుస్తూ ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చురకు అంటించారు. ‘వీఐపీ కల్చర్ విషయంలో ప్రపంచాన్ని విమర్శించే కేజ్రీవాల్.. ఇప్పుడు ట్రంప్ కంటే పెద్ద సెక్యూరిటీమధ్య తిరుగుతున్నారు.’ అని సోషల్ మీడియా ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. భారీ కాన్వాయ్ తో పంజాబ్ వెళ్తున్న కేజ్రీవాల్ వీడియోని ఆపోస్టుకు జత చేశారు.

బీజేపీ విమర్శలు

అంతేకాకుండా, ఢిల్లీ మంత్రి, బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా కేజ్రీవాల్‌పై నిప్పులు చెరిగారు. ఆయన వ్యవహారం మహరాజులా ఉందని మండిపడ్డారు. సిర్సా చేసిన పోస్టులో..‘ఒకప్పుడు వ్యాగన్ఆర్‌లో సామాన్యుడిగా నటించిన కేజ్రీవాల్, ఇప్పుడు బుల్లెట్‌ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్లు, వంద మందికి పైగా పంజాబ్ పోలీసు కమాండోలు, జామర్లు, అంబులెన్స్‌లతో కూడిన విలాసవంతమైన మహారాజా కాన్వాయ్‌లో విపాసన ధ్యానం కోసం వెళ్లారు. అధికారం అనే పరీక్షలో ఆయన దారుణంగా ఫెయిలయ్యారు. ఆప్ నిజమేంటో ప్రపంచానికి తెలిసింది. మోసం, కపటత్వం, వీఐపీ అహంకారానికి ఇదే నిదర్శనం’ అని విమర్శించారు.

Next Story