భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన.. బంగ్లాదేశీయుల అరెస్ట్

by Geesa Chandu |

బంగ్లాదేశ్ పౌరులు భారత్ లో ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూనే ఉన్నారు.

భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన.. బంగ్లాదేశీయుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ పౌరులు భారత్ లో ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. 16 మంది బంగ్లాదేశ్ జాతీయులను అగర్తలా రైల్వే స్టేషన్లో పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 13 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులో ఉన్నారు.పట్టుబడిన వారిలో ముగ్గురు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపైనా అగర్తల రైల్వే పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినా బంగ్లాదేశ్ పౌరులు భారత్ లోకి ప్రవేశించడం మాత్రం ఆగలేదు.

Next Story