- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Army: భారత సైన్యం మరింత బలోపేతం..13 ప్రాజెక్టులకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
భారత సైన్యం సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైన్యం సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 1,981.90 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర పరికరాలు కొనుగోలు చేసేందుకు గాను 13 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను వేగంగా పెంచడానికి ఈ డిసిషన్ తీసుకున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసర కొనుగోలు కింద ఈ ఒప్పందాలు జరిగినట్టు పేర్కొంది. వీటి కింద ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్‌డిక్షన్ సిస్టమ్స్ (IDDIS), లో-లెవల్ లైట్ వెయిట్ రాడార్లు, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, లాంచర్లు, క్షిపణులు, రిమోట్లీ పైలట్ ఏరియల్ వెహికల్స్ (RPAVలు), వర్టికల్ టేక్-ఆఫ్ ల్యాండింగ్ (VTOL) వ్యవస్థలతో సహా లాటరింగ్ మునిషన్లు, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్స్ (QRFVలు) సహా ఇతర పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ ఆధునిక ఆయుధాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపింది. ఈ ఒప్పందాలు స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.






