- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూట్లతో కొట్టుకున్న CM, డిప్యూటీ సీఎం వర్గపు అధికారులు
ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుదంటూ గతకొన్ని రోజులుగా కర్ణాటక(Karnataka)లో వార్తలు హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుదంటూ గతకొన్ని రోజులుగా కర్ణాటక(Karnataka)లో వార్తలు హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల మైసూరులో జరిగిన కాంగ్రెస్ విజయోత్సవ సభలో డీకే శివకుమార్(DK Sivakumar) పేరు ప్రస్తావించడంతో సిద్ధరామయ్య(Siddaramaiah) అసహనం వ్యక్తం చేశారు. వేదికపై లేని వారి పేరు ఎందుకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దీంతో మరోసారి సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం జరుగుతున్న పోటీ మరోసారి బహిర్గతమైంది. ఇది మరువక ముందే.. మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో సీఎం సిద్ధరామయ్య పేషీలోని ప్రత్యేక అధికారి, అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ సి.మోహన్ కుమార్, తనపై బూటుతో దాడి చేశాడని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేషీలోని ప్రత్యేక అధికారి హెచ్.ఆంజనేయ ఫిర్యాదు చేశారు. బూట్లతో కొట్టుకున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇప్పటికే రెసిడెంట్ కమిషనర్ జమీర్ కూడా నిర్ధారించారు. ట్వీట్






