ఓటు వేసే సమయంలో ఫొటో దిగుతున్నారా.. అయితే కటకటాలు తప్పవు..

by Disha Web Desk 4 |
ఓటు వేసే సమయంలో ఫొటో దిగుతున్నారా.. అయితే కటకటాలు తప్పవు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఓటు వేసే సమయంలో ఫొటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయలనుకుంటున్నారా..? అయితే జాగ్రత్త.. కష్టాలు కొని తెచ్చుకోవద్దు. మధ్యప్రదేశ్‌లో ఓటు వేసే సమయంలో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసిన 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు పోలీంగ్ నవంబర్ 17న ముగిసింది. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యూలేషన్లను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

17 మందిపై ఐపీసీ సెక్షన్ 188, 128 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసు నమోదైంది. అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ సంజయ్ చౌరసియా ఫిర్యాదు మేరకు సిరోంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విదిష కలెక్టర్ ఉమాశంకర్ భార్గవ్ మాట్లాడుతూ.. ఓటు వేసే సమయంలో ఈవీఎం కనిపించేలా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో కొంత మంది వైరల్ చేసారని ఏఆర్వో నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ఉల్లంఘన కిందకు ఇది వస్తుందన్నారు.


Next Story

Most Viewed