- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్ర ప్రజలను రాహుల్ అవమానించారు
మహారాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్దమైన తీర్పు ద్వారా ఎన్డీయేను గెలిపించి, మీ పార్టీని మాయం చేశారనే కోపంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫడ్నవీస్ విమర్శించారు.

- వెంటనే క్షమాపణలు చెప్పాలి
- మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
దిశ, నేషనల్ బ్యూరో:
కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర ప్రజలను అవమానించారు. ఆయన తన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పాని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో 70 లక్షల మంది కొత్త ఓటర్లను అసెంబ్లీ ఎన్నికలకు ముందు కలిపారని ఆరోపించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కొత్తగా ఈ ఓడర్లను చేర్చారు. ఇది హిమాచల్ ప్రదేశ్ జనాభాతో సమానం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా, రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో మహారాష్ట్రనే కాకుండా మహారాష్ట్ర ప్రజలను కూడా అవమానించారని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలే, వీర్ సావర్కర్ వంటి మహనీయులు పుట్టిన నేల ఇది. మహారాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్దమైన తీర్పు ద్వారా ఎన్డీయేను గెలిపించి, మీ పార్టీని మాయం చేశారనే కోపంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫడ్నవీస్ విమర్శించారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా.. మహారాష్ట్ర ప్రజలపై అభాండాలు వేస్తున్నారు. ఈ విషయంలో మీకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.






