- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు (Shooting) కలకలం సృష్టించాయి. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వర్జీనియాలోని (Virginia) స్పాట్సిల్వేనియా కౌంటీలోని నివాస ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. 911 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
స్పాట్సిల్వేనియా షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి మేజర్ ఎలిజబెత్ స్కాట్ (Major Elizabeth Scott) మాట్లాడుతూ కాల్పులు జరిగిన చోట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలువురు దుండగులు ముసుగు ధరించి కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అయితే, కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుల వివరాలు కూడా ఇంకా వెల్లడించలేదు.






