రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతగా నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-13 04:04:31  IST  )

రష్యాను వరుస భూకంపంకాలు కుదిపేస్తున్నాయి.

రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతగా నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యాను వరుస భూకంపంకాలు కుదిపేస్తున్నాయి. తాజాగా తూర్పు తీరంలోని కామ్చాట్కా రీజియన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని 10 కి.మీ లోతులో గుర్తించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్ - కామ్‌చట్స్కీ నగరం నుంచి 111.7 కి.లోమీటర్ల తూర్పున ఉన్నట్లుగా నిర్ధారించారు. అయితే ఈ భూకంపంతో ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదు.

Next Story