- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి
ఇటీవల కాలంలో విదేశాల్లో ఉన్న భారతీయులపై దాడులు ఎక్కువవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో విదేశాల్లో ఉన్న భారతీయులపై దాడులు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియాలోని (Australia) భారతీయ విద్యార్థులపై జాత్యహంకార దాడులు ఆగటం లేదు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఓ భారత విద్యార్థిపై దుండగులు తీవ్రంగా దాడి చేసిన ఘటన మరవకముందే.. తాజాగా మరో భారత విద్యార్థిపై దుండగులు కత్తితో దాడి చేశారు. మెల్‌బోర్న్‌లో నివాసం ఉంటున్న సౌరభ్ ఆనంద్ (Saurabh Anand) అనే భారత విద్యార్థి ఇటీవల ఓ షాపింగ్ సెంటర్‌కు వెళ్లగా ఐదుగురు దుండగులు కత్తితో దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో సౌరభ్ మెడ, తలకు తీవ్ర గాయాలు కాగా.. భుజం విరిగిపోయింది. స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ఐదురుగు యువకుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, వరుస దాడుల ఘటనలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్ అయింది.






