- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi : రాహుల్ గాంధీపై మరో కేసు!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తరుచు వివాదస్పద వ్యాఖ్యలతో కేసుల పాలవుతున్నారు. తాజాగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తరుచు వివాదస్పద వ్యాఖ్యలతో కేసుల పాలవుతున్నారు. తాజాగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో పాటు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గువాహటి(Guwahati)లోని పోలీస్ స్టేషన్(Police Station)లో ఆయనపై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదైంది.
మోన్‌జిత్ చాటియా(Monjit Chatia)అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు(Complaint)మేరకు కేసు(Case File) నమోదు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పరిమితులను దాటి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని చాటియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అశాంతి, వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్‌కు ఉందన్నారు. కానీ ఆయన అబద్ధాలు ప్రచారం చేసి దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని చాటియా తన ఫిర్యాదులో ఆరోపించారు.
గతంలో 2019ఎన్నికల్లో దొంగలందరికి ఇంటిపేరు మోడీనే ఎందుకుంటుందంటూ మోడీలపై చేసిన వ్యాఖ్యలపైన, కర్ణాటకలో 2023 ఎన్నికల ప్రచారం ప్రకటనలపై, లండన్ లో వీర సావర్కర్ పైన చేసిన వ్యాఖ్యలపైన, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కుల గణనపైన చేసిన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ కోర్టు కేసుల పాలయ్యారు. ఇటీవల పార్లమెంటు ప్రాంగణలో జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 2014లో మహాత్మగాంధీని హతమార్చేందుకు ఆర్ఎస్ఎస్ విధానాలే కారణమన్న రాహుల్ వ్యాఖ్యలపై కూడా లఖింపూరి కేరి జిల్లాలో కేసు నమోదైంది. అమెరికాలో మతస్వేచ్ఛ గురించి మాట్లాడుతూ సిక్కుల తలపాగా, కంకణం, బాకుల ధారణపై చేసిన వ్యాఖ్యలు, భారత్ ఒక దేశం కాదని, రాష్ట్రాల సమాఖ్య మాత్రమేనంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను వివాదస్పదమయ్యాయి.






