Pak Cyber Attack : భారత్ పై పాక్ మరో దాడి.. హెచ్చరించిన ఇంటలిజెన్స్ వర్గాలు

by Muthe.Rajitha |

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

Pak Cyber Attack : భారత్ పై పాక్ మరో దాడి.. హెచ్చరించిన ఇంటలిజెన్స్ వర్గాలు
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాలు వార్ కు రెడీ అయ్యాయి. సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో పాక్ నుంచి మరో దాడి మొదలైంది. భారత రక్షణశాఖకు చెందిన పలు వెబ్సైట్లపై పాక్ చెందిన పలు గ్రూపులు సైబర్ అటాక్(Pak Cyber Attack) చేసినట్టు సమాచారం. మరిన్ని సైబర్ దాడుల ముప్పు ఉండవచ్చునని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు తీవ్ర హెచ్చరికలు(Central Intelligence Agency Alerts) జారీ చేశాయి. పాక్ కు చెందిన "IOK Hacker", "Hope 1337", "పాకిస్థాన్ సైబర్ ఫోర్స్" వంటి హ్యాకర్ గ్రూపులు భారత రక్షణ సంస్థలు, విద్యాశాఖ, ఆసుపత్రుల వెబ్‌సైట్లను టార్గెట్ చేస్తున్నాయి.

ఏప్రిల్ 29 నుంచి మే 5, 2025 వరకు జరిగిన సైబర్ దాడుల్లో.. మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్(AVNL) వంటి వెబ్‌సైట్లను హ్యాక్ చేసి, పాకిస్థాన్ జెండా, అల్ ఖలీద్ ట్యాంక్ ఫొటోలు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కొన్ని సైట్లలో డేటా లీక్, లాగిన్ వివరాలు దొంగిలించినట్లు పేర్కొన్నారు. కానీ భారత సైబర్ సెక్యూరిటీ టీమ్ ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది. AVNL వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్‌లోకి తీసుకుని ఆడిట్ చేస్తుండగా.. మిగతా సైట్లలో క్లాసిఫైడ్ డేటా లీక్ కాలేదని రక్షణశాఖ అధికారులు ప్రకటించారు. సైబర్ సెక్యూరిటీ టీమ్ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతోపాటు.. మరిన్ని దాడులను నివారించడానికి డిజిటల్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తోంది.

ఈ దాడులు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో జరుగుతున్నాయి. పాకిస్థాన్ నుంచి వస్తున్న ఈ సైబర్ దాడులు భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ సైబర్ దాడులు పెద్ద నష్టం చేయలేకపోయినా.. ముందు ముందు ఇలాంటి దాడులను అడ్డుకోవడానికి భారత్ తన సైబర్ సెక్యూరిటీని మరింత బలంగా తయారు చేయడంతోపాటు, అంతర్జాతీయ సహకారంతో ఇలాంటి హ్యాకర్లను గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంది.

Next Story