దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు మరో 12 చీతాలు

by Dishanational2 |
దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు మరో 12 చీతాలు
X

భోపాల్: దేశంలో ఉనికిని కోల్పోయిన చీతాలను ఈ మధ్యనే కేంద్రం తీసుకొచ్చి పునరుజ్జీవం కల్పించే ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో బ్యాచ్ చీతాలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తొంది. ఈ నెల 18న 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌కు తీసుకురానున్నట్లు అటవీ శాఖ అధికారులు శనివారం తెలిపారు. కునోకు తరలించే ముందు వీటిని దక్షిణాఫ్రికా నుంచి గ్వాలియర్‌కు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. వీటిని నెల రోజుల పాటు క్వారైంటన్‌లో ఉంచనున్నారు. అంతకుముందు గతేడాది ఎనిమిది చీతాలను కేంద్రం నమీబియా నుంచి కునో జాతీయ పార్కుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇవి త్వరలోనే పూర్తి స్థాయి స్వేచ్ఛ జీవితాన్ని ప్రారంభించనున్నాయి. దేశంలో 1947 చివరి చీతా మరణించింది. 1952లో భారత్‌లో చీతాలు మనుగడలో లేవని ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్రం చొరవ తీసుకుని వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.

Next Story

Most Viewed