- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబానీ మనీ లాండరింగ్ కేసులో కీలక మలుపు.. సన్నిహితుడు అరెస్ట్
by Naga Rani Yarlagadda |
ముకేష్ అంబానీ (Mukesh Ambani) సోదరుడు, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) రూ.17 వేల కోట్ల రుణాల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముకేష్ అంబానీ (Mukesh Ambani) సోదరుడు, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) రూ.17 వేల కోట్ల రుణాల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనిల్ అంబానీకి సన్నిహితుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అయిన అశోక్ కుమార్ పాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 (PMLA) నిబంధనల కింద అశోక్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. అశోక్ కుమార్ పాల్ 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్. ఏడేళ్లుగా అతను రిలయన్స్ పవర్ లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.
Next Story






