దేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ.. బీజేపీ అభ్యర్థి తిరుగులేని విజయం

by Jakkula.Mamatha |

దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు మార్నింగ్ 8 గంటల నుంచి ప్రారంభం అయింది.

దేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ.. బీజేపీ అభ్యర్థి తిరుగులేని విజయం
X

దిశ,వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అయింది. ఇండోర్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి శంకర్ లల్వాణి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ దిశగా ఇండోర్ లోక్‌సభ స్థానంలో 10,08,077 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో మెజారిటీ సాధించిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో విచిత్ర పరిణామం నెలకొంది. శంకర్ లల్వాణి తర్వాత అత్యధికంగా నోటాకు 2,18,674 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఇక్కడ బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.

Next Story