సినిమాను తలపించే ఘటన.. పారిపోతున్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ ఏం చేశారంటే?(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-27 08:25:17  IST  )

రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

సినిమాను తలపించే ఘటన.. పారిపోతున్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ ఏం చేశారంటే?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తమిళనాడు(TamilNadu)లోని తిరుపతి హైవేపై సినిమాను తలపించే సంఘటన చోటు చేసుకుంది. మోస్ట్ వాంటెడ్ నేరగాడిని పట్టుకునేందుకు ఓ ఎస్సై ప్రాణాలకు తెగించి ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ వాహనదారుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రజెంట్ వైరల్‌గా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ హత్య కేసుతో పాటు, ఇతర నేరాల్లో నిందితుడిగా ఉన్న అలగరాజ అనే వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు తిరువళ్లూరు జిల్లాలో తలదాచుకున్నాడని పక్కా సమాచారం రావడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.

ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ తరుణంలో అక్కడి నుంచి(తిరువళ్లూరు జిల్లా) కారులో తమిళనాడు(Tamilnadu) తిరుపతి(Tirupati) హైవే మీదుగా వేగంగా ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో జామ్ బజార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై ఆనంద్ కుమార్ నిందితుడిని పట్టుకునేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నిందితుడిని ఎలాగైన పట్టుకోవాలనుకున్నారు. ఈ సమయంలోనే వేగంగా వెళ్తున్న కారు పైకి అమాంతం దూకేశాడు. కారును గట్టిగా పట్టుకుని వేలాడుతూ.. దాదాపు కి.మీ దూరం పాటు కారుతో పాటే ప్రయాణించారు. కానీ.. కారులోని దుండగులు ఎస్సైని బలవంతంగా కిందకు తోసేశారు. దీంతో ఎస్సై కిందపడిపోయాడు. ఆ సమయంలో ఆయనకు హెల్మెట్ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన ఎస్సైని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో(Video) తెగ వైరల్ అవుతోంది.

Twitter Link

Next Story