- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాను తలపించిన ఘటన.. పెళ్లి చూపులు చూసిందొకరు.. పెళ్లికొడుకుగా వచ్చిందొకరు! చివరకు ఏమైందంటే?
రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని రాయ్‌బరేలీ జిల్లాలోని ఓ గ్రామంలోని ఓ యువతికి హరియాణా(Hariyana)లోని పానిపట్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి కూడా సమయం తక్కువగా ఉంది. పెళ్లి(Marriage) పనులు చకచకా పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి రోజు రానే వచ్చింది. వధువు ఇంట్లో బంధువులతో సందడి వాతావరణం నెలకొంది.
వివాహం అనుకున్న సమయానికి జరిపించాలనే ఆలోచనలో వధువు కుటుంబ సభ్యులు.. ఇక వరుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ముహూర్త సమయానికి బంధువులతో కలిసి పెళ్లి కొడుకు మండపానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడిని చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. పెళ్లి కొడుకు స్థానంలో మరో యువకుడు రావడంతో అందరూ బిత్తరపోయారు. చివరికి తేరుకొని మోసపోయామని గ్రహించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. పెళ్లి సంబంధాల కోసం మధ్యవర్తిగా ఉన్న ఓ మహిళ ద్వారా వధువు తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె ఓ యువకుడి ఫొటో పంపింది. సదరు యువకుడు వారికి నచ్చడంతో పెళ్లి నిశ్చయించుకున్నారు. ఇరువైపుల వారు ఒకే అనుకున్నారు. ఇక సరిగ్గా పెళ్లి రోజునే వధువు కుటుంబానికి షాక్ తగిలింది. వరుడి బదులు మరో యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి రావడంతో వధువు కుటుంబం ఆందోళన చెందింది.
దీంతో మధ్యవర్తిని నిలదీశారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి కొడుకుగా వచ్చిన యువకుడిని, అతడి బంధువులు, మధ్యవర్తి సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇది నకిలీ మ్యారేజ్ బ్రోకర్ల పనేనని.. పెళ్లి కుదిర్చి, ఆపై డబ్బు, బంగారంతో ఈ ముఠా ఉడాయిస్తుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






