యువకుడి గుండు గీసి బలవంతంగా మూత్రం తాగించిన హిజ్రాలు

by Javid Pasha |
యువకుడి గుండు గీసి బలవంతంగా మూత్రం తాగించిన హిజ్రాలు
X

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది హిజ్రాలు ఓ యువకుడి గుండు గీసి అనంతరం అతడి చేత బలవంతంగా మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 26న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కస్‌గంజ్ జిల్లాలో ఐదుగురు హిజ్రాలు ఓ యువకుడిని ఒంటరిగా దొరకబట్టి టార్చర్ చేశారు. ముందుగా అతడి గుండు గీశారు. అనంతరం అతడి చేత మూత్రం తాగించారు. బాధితుడు రఫీకుల్ గతంలో ఓ హిజ్రా ఇంట్లో పని చేసేవాడు. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడ పని మానేసి వేరే హిజ్రా వద్ద పనికి కుదిరాడు. దీంతో మొదటి ఓనర్ రఫీకుల్ పై కోపాన్ని పెంచుకుంది.

ఈ క్రమంలోనే రఫీకుల్ పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో యువకుడు మొదట పని చేసిన హిజ్రా.. తన నలుగురు హిజ్రా ఫ్రెండ్స్ తో కలిసి అతడిని అడ్డగించింది. తనను కాదని వేరే వ్యక్తి వద్ద ఎలా పని చేస్తావని నిలదీసింది. తన ఫ్రెండ్స్ తో కలిసి అతడికి గుండు గీసింది. అనంతరం అతడి చేత బలవంతంగా మూత్రంగా తాగించారు. అతడి నుంచి రూ.10 వేలు లాక్కున్నారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.



Next Story