ఆగస్టు 16 నుంచి ‘అమృత్‌ ఉద్యాన్‌’ సందర్శన

by Naga Rani Yarlagadda |

ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ ను ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచనున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఆగస్టు 16 నుంచి ‘అమృత్‌ ఉద్యాన్‌’ సందర్శన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ (Amrit Udyan)ను ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచనున్నట్లు రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సందర్శకులకు అనుమతి ఉంటుందని, అమృత్ ఉద్యాన్ నిర్వహణ నిమిత్తం ప్రతి సోమవారం సెలవు ఉంటుందని తెలిపాయి. కాగా.. రాష్ట్రపతి భవన్లోని ఉద్యానవనంలో బాలవాటిక, హెర్బల్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, సెంట్రల్ లాన్, సర్క్యులర్ గార్డెన్, లాంగ్ గార్డెన్ వంటివి సందర్శనలో ఉండనున్నాయి. ప్రతి మొక్కకు ఉన్న క్యూఆర్ కోడ్‌తో ఆ మొక్క జాతి, చరిత్ర గురించి తెలుసుకోవచ్చు.

అమృత్ ఉద్యానవనాన్ని సందర్శించాలనుకునేవారు ఆన్లైన్, ఆఫ్ లైన్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్ సైట్లో, ఆఫ్ లైన్లో 35వ ఎంట్రీ వద్దకు చేరుకున్నాక స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్లేవారు మొబైల్స్, ఎలక్ట్రానిక్ కీలు, హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, వాటర్ బాటిల్స్, పిల్లలకు మిల్క్ సీసాలు, గొడుగులు వంటివి మాత్రమే అనుమతిస్తారు. ఇక ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే, సెప్టెంబర్ 5న టీచర్స్ డే పురస్కరించుకుని క్రీడాకారులకు, టీచర్లకు ప్రత్యేక ప్రవేశ సదుపాయాన్ని కల్పిస్తామని అధికారులు తెలిపారు.

Next Story