రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ పై అమిత్ షా ప్రశంసలు

by Naga Rani Yarlagadda |

కేంద్ర మంత్రివర్గానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయం శరవేగంగా మారుతోంది.

రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ పై అమిత్ షా ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రివర్గానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయం శరవేగంగా మారుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పదవికి రాజీనామా చేసిన అనంతరం ప్రధాన్‌తో అమిత్ షా సమావేశమై, తదుపరి రాజకీయ పరిణామాలు, కేంద్ర మంత్రివర్గంలో చేపట్టాల్సిన మార్పులపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ధర్మేంద్రప్రధాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా విద్యాశాఖకు ఆయన అందించిన సేవలు మరచిపోలేమంటూ ప్రశంసించారు. ఈ అత్యవసర భేటీతో పాటు, బిజెపి అధిష్టానం ఇప్పటికే పలు రాష్ట్రాల కీలక నేతలను, మిత్రపక్షాల భాగస్వాములను ఢిల్లీకి పిలిపించింది. కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగవంతం కానుందనే వార్తల నడుమ హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన, రాజధాని రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Next Story