అమిత్ షా ఫేక్ వీడియో కేసు: కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌కు బెయిల్

by Disha Web Desk 9 |
అమిత్ షా ఫేక్ వీడియో కేసు: కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌కు బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: అమిత్ షాపై ఫేక్ వీడియో చేశారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్‌తో పాటు విష్ణు, వంశీ, నవీన్, గీత, ఆస్మా తస్లీమ్, శివలను హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఐదుగురు నిందితులు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈరోజు వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసులో వారికి నాంపల్లి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులు ప్రతి సోమవారం, శుక్రవారం పోలీస్ స్టేషన్ వెళ్లి సంతకాలు పెట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed