China: అమెరికాతో టారీఫ్ వార్.. భారతీయులకు గుడ్ న్యూస్

by Shamantha N |

అమెరికాతో టారీఫ్ వార్ వేళ.. భారతీయులకు చైనా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 9 వరకు భారతీయ పౌరులకు 85 వేల వీసాలను జారీ చేయనుంది.

China: అమెరికాతో టారీఫ్ వార్.. భారతీయులకు గుడ్ న్యూస్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాతో టారీఫ్ వార్ వేళ.. భారతీయులకు చైనా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 9 వరకు భారతీయ పౌరులకు 85 వేల వీసాలను జారీ చేయనుంది. ఈ మేరకు చైనాలోని ఎంబసీ ప్రకటన చేసింది. రెండు దేశాల మ‌ధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రకటన తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనీస్ అంబాసిడ‌ర్ జూ ఫీహంగ్ దీనిపై మాట్లాడుతూ.. చైనాకు ట్రావెల్ చేస్తున్న 85 వేల ఇండియ‌న్ల‌కు వీసాలు ఇచ్చిన‌ట్లు తెలిపారు. చైనాకు ఎక్కువ మంది భార‌తీయులు రావాలని కోరుతున్న‌ట్లు వెల్ల‌డించారు. భార‌త్‌, చైనా మ‌ద్య రాకపోకలను సులభతరం చేసేందుకు అనేక స‌దుపాయాలు క‌ల్పించిన‌ట్లు చైనీస్ ప్ర‌భుత్వం చెప్పింది.

వీసాల కోసం అపాయింట్ మెంట్ అవసరం లేదు

ఇకపోతే, వీసాల కోసం ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ అవ‌స‌రం లేద‌ని చైనీస్ అధికారులు చెప్పారు. వీసా సెంట‌ర్ల వ‌ద్ద నేరుగా వెళ్లి వీసా ద‌ర‌ఖాస్తుల‌ను అందజేయవచ్చని పేర్కొన్నారు. అతితక్కువ సమయం కోసం చైనా వెళ్లే వారు బ‌యోమెట్రిక్ డేటాను స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేదన్నారు. త‌క్కువ ధ‌ర‌కే చైనా వీసాను అందిస్తున్న‌ట్లు చెప్పారు. భారతీయులకు ట్రావెల్ స‌దుపాయాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. వీసా అప్రూవ‌ల్ టైంలైన్ కూడా త‌గ్గించామన్నారు. వీలైనంత త్వ‌ర‌గా వీసాల‌ను జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భార‌తీయ టూరిస్టుల‌ను యాక్టివ్‌గా ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు చైనా టూరిజం శాఖ తెలిపింది. ఫెస్టివ‌ల్స్ స‌మ‌యంలో ఎక్కువ ప్రోత్స‌హిస్తున్న‌ట్లు చెప్పారు.

Next Story