- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గాం ఉగ్ర దాడిపై అమెరికా కీలక నిర్ణయం
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిపై భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిపై భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (The Resistance Front)ను విదేశీ ఉగ్రవాద సంస్థ (Foreign Terrorist Organization)గా అమెరికా గుర్తించింది. అంతేకాదు, గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థగా (Specially Designated Global Terrorist)గా కూడా TRFను గుర్తించినట్టు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.
టీఆర్ఎఫ్ అనేది పాకిస్థాన్‌కు చెందిన ముఖ్య ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా (LeT) ముసుగు సంస్థగా పనిచేస్తోంది. గతంలో భారత భద్రతా దళాలపై జరిగిన అనేక దాడులకు బాధ్యత వహించిందని, అలాగే పహల్గాం దాడిలో కూడా టీఆర్ఎఫ్ పాత్ర ఎంతో స్పష్టమని విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. అలాగే, 'జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇదే మా పరిపాలన నిబద్ధతను చెబుతోంది' అని రూబియో తెలిపారు.
కాగా, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ముష్కరులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇక పహల్గాం దాడికి వెంటనే స్పందించిన భారత్, పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట బలమైన దాడులు జరిపింది. ఈ ఆపరేషన్‌లో పలు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి.






