Allahabad HC: లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ మధ్యతరగతి విలువలకు వ్యతిరేకం.. అలహాబాద్ హైకోర్టు

by B.Srinivas |

లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా సంబంధాలు మధ్య తరగతి ప్రజల విలువలకు వ్యతిరేకమని తెలిపింది.

Allahabad HC: లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ మధ్యతరగతి విలువలకు వ్యతిరేకం.. అలహాబాద్ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌పై అలహాబాద్ హైకోర్టు (Allahabad high court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా సంబంధాలు మధ్య తరగతి ప్రజల విలువలకు వ్యతిరేకమని తెలిపింది. రిలేషన్ షిప్ ముగిశాక పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. వివాహం తర్వాత పురుషులు సులభంగా ముందుకు వెళ్లి స్థిరపడతారని, కానీ మహిళలు జీవిత భాగస్వామిని కనుగొనడంలో ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయపడింది. షేన్ ఆలం అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని నమ్మించి ఓ మహిళలో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత వివాహం చేసుకోవడానికి నిరారించాడని ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న క్రమంలో జస్టిస్ సిద్ధార్థ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ తరహా కేసులు పెరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు లివ్ ఇన్ రిలేషన్ షిప్ నకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ తరహా కేసులు మరింత పెరిగాయని, ఈ కేసులో విసుగు చెందామని తెలిపింది. ‘లివ్-ఇన్-రిలేషన్‌షిప్ అనే భావన మహిళల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. దీని వల్ల వారికే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒక పురుషుడు మహిళలతో లివ్ ఇన్ తర్వత కూడా వివాహం చేసుకోవచ్చు. కానీ స్త్రీలు మాత్రం తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టం’ అని తెలిపింది. లివ్ ఇన్ రిలేషన్ యువతరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి ఫిబ్రవరి 25 నిందితుడు నిరంతరం జైలులో ఉండటం, గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోవడాన్ని గుర్తించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Next Story