పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధం.. మే 25న రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా వేడుక

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-17 11:06:22  IST  )

రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 25న పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరగనుంది.

పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధం.. మే 25న రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా వేడుక
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ అవార్డుల’ (Padma Awards) ప్రదానోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 25న న్యూఢిల్లీలోని రాష్ట్రీయ భవన్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ రంగాలలో దేశానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తన చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే, ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 131 మంది ప్రతిభావంతులను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సమాజ సేవ, కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం-పరిశ్రమలు వంటి విభిన్న రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ఈ గౌరవం దక్కింది.

ఈ మేరకు ఐదుగురికి పద్మ విభూషణ్. 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని చారిత్రాత్మక దర్బార్ హాల్‌లో జరగనున్న ఈ అధికారిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Next Story