- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూలిన ఎయిర్ అంబులెన్స్..ఏడుకు చేరిన మృతుల సంఖ్య!
జార్ఖండ్‌లోని చత్రాలో రాంచీ-ఢిల్లీ ఎయిర్ అంబులెన్స్ కూలిపోవడంతో 7 మంది ప్రయాణికులు మరణించారు.

దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్‌లోని రాంచీలో పెను ప్రమాదం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని ( Jharkhand ) ఛత్రాలో ( Chatra) రాంచీ-ఢిల్లీ ఎయిర్ అంబులెన్స్ ( air ambulance ) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 మంది ప్రయాణికులు మరణించారని ప్రచారం జరుగుతోంది. మొదట ఈ ప్రమాదంలో ఒక్కరే మరణించారని గుర్తించారు. అయితే, ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. విమానం కుప్పకూలడంతో ఏడుగురు దుర్మరణం చెందారట.
రాంచీ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయ్యాక ఎయిర్ అంబులెన్స్ కూలినట్లు గుర్తించారు అధికారులు. ఛత్ర సమీపంలోని అడవిలో కుప్పకూలగా.. అందులోని 7 గురు దుర్మరణం చెందారని సమాచారం. ఈ ఘటనలో రోగి, డాక్టర్, మెడికల్ & విమాన సిబ్బంది కలిపి 7 గురు మృతి చెందారని తెలుస్తోంది.
మృతుల వివరాలు ఒకసారి పరిశీలిస్తే, రోగి సంజయ్ కుమార్ (41), డాక్టర్ వికాష్ కుమార్ గుప్తా మృతి చెందారు. పారామెడిక్ సచిన్ కుమార్ మిశ్రా, అటెండెంట్స్ అర్చనా దేవి, ధురు కుమార్ దుర్మరణం చెందారట. పైలట్స్ వికాశ్ భగత్, సవ్రాజ్‌దీప్ సింగ్ కూడా చనిపోయారని సమాచారం.






