ఒక రోజు నా కూతురు న్యూడ్ ఫొటోలను పంపమని అడిగారు: అక్షయ్ కుమార్

by Malleboina Mahesh |   (  Updated:2025-10-03 14:41:18  IST  )

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్.. ఆన్ లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో తన కూతురు ఎదుర్కొన్న అనూహ్య ఘటనను మీడియాతో పంచుకున్నారు.

ఒక రోజు నా కూతురు న్యూడ్ ఫొటోలను పంపమని అడిగారు: అక్షయ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ (Actor Akshay Kumar).. ఆన్ లైన్ వీడియో గేమ్ (Online video game) ఆడుతున్న సమయంలో తన కూతురు ఎదుర్కొన్న అనూహ్య ఘటనను మీడియాతో పంచుకున్నారు. ఈ రోజు ముంబై పోలీసులు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం (Cybercrime awareness program)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. "కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటనను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. కొద్ది నెలల క్రితం నా కూతురు నిత్యం వీడియో గేమ్ ఆడుతుండేది. ఆన్ లైన్‌లో మీరు ఎవరితోనైనా ఆడగల కొన్ని వీడియో గేమ్‌లు ఉన్నాయి. మీరు తెలియని అపరిచితుడితో ఆ గేమ్‌లలో ఆడవచ్చు. నా కూతరు కూడా అలానే చేసింది. సరదాగా ఆమెకు తెలియని వారితో గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు.. అవతలి నుంచి ఒక సందేశం వచ్చింది.

అందులో మీరు స్త్రీ లేదా పురుషుడా అని ఆమెను ప్రశ్నించగా ఆమె తాను స్త్రీ అని సమాధానం ఇచ్చింది. ఆపై అతను వెంటనే మరో సందేశం పంపారు. మీరు మీ నగ్న చిత్రాలను నాకు పంపగలరా? అని అందులో అడిగాడు. ఆ మెసేజ్ చూసిన నా కూతురు వెంటనే భయంతో గేమ్ నుంచి బయటకు వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జరిగిన విషయం నా భార్యకు చెప్పింది. ఇది కూడా సైబర్ నేరంలో భాగమే. కాబట్టి.. ఏడవ, ఎనిమిదవ, పదవ తరగతులలో కూడా సైబర్ పీరియడ్ అనే కాలం ఉండాలని, దాని గురించి పిల్లలకు వివరించాలని తాను ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను అభ్యర్థిస్తున్నానని ఈ సందర్భంగా నటుడు అక్షయ్ కుమార్ రిక్వెస్ట్ చేశారు.

Next Story