- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ajit Pawar: శరద్ పవార్ ఫ్యామిలీలో విభేదాలు సృష్టించారు.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Ncp) చీఫ్ అజిత్ పవార్ (Ajit pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్(Sharad pawar) కుటుంబంలో విభేదాలు సృష్టించి తనపై అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు. సోమవారం ఆయన బారామతి (Baramati) నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. తాను ఇంతకుముందు తప్పు చేశానని, కానీ ఇప్పుడు ఇతర వ్యక్తులు కూడా తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తోందని శరద్ పవార్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా ఎవరినీ బరిలోకి దింపొద్దని తన కుటుంబ సభ్యులే సూచించినా, ఒకరిని బరిలోకి దిగాలని ఆదేశించారని తెలిపారు. ‘రాజకీయాలను(Politics) ఇంత దిగజార్చకూడదు. ఎందుకంటే తరతరాలు కలిసిపోవడానికి సమయం పడుతుంది. కానీ ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి క్షణం కూడా పట్టదు’ అని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాగా, బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ మేనల్లుడు యుగేంద్ర పవార్(Yugendra pawar) ఎన్సీపీ(ఎస్పీ) తరఫున బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలోనే అజిత్ పై వ్యాఖ్యలు చేశారు.






