ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి.. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-20 03:22:49  IST  )

స్పైస్‌జెట్ (Spice Jet) ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) పైలట్ దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (IGIA)లోని టర్మినల్-1లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి.. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: స్పైస్‌జెట్ (Spice Jet) ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) పైలట్ దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (IGIA)లోని టర్మినల్-1లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రయాణికుడు అంకిత్ దేవాన్ (Ankit Devan) స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో భార్య, తన 7 ఏళ్ల కూతురు, 4 నెలల శిశువుతో స్ట్రోలర్‌లో వెళ్తున్నందున ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వారిని స్టాఫ్ లైన్ అంటే సెక్యూరిటీ చెక్ లైన్ ద్వారా వెళ్లమని సూచించారు.

ఈ నేపథ్యంలోనే అంకిత్ దేవాన్ స్టాఫ్ క్యూలో ఉండగా.. అప్పుడే డ్యూటీ నుంచి దిగిన ఎయిరిండియా కెప్టెన్ వీరేందర్ సేజ్వాల్ (Virender Sejwal) వారిని దాటి ముందుకు వెళ్తుండగా అంకిత్ తీవ్ర అభ్యంతరం చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. అనంతరం వీరేందర్ సేజ్వాల్ సహనం కోల్పోయి అంకిత్ దేవాన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం అంకిత్ రక్తం కారుతుండగానే విషయాన్ని అతడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశాడు. అయితే, తాజాగా ఈ ఘటనపై స్పందించిన ఎయిరిండియా పైలట్ వీరేందర్ సేజ్వాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ.. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రయాణికులపై ఓపిక లేకుండా ఫ్లైట్ సిబ్బంది దాడికి పాల్పడటం ఏంటని.. అటు సాధారణ ప్రజలు, నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

Next Story