ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైట్‌లో టెక్నికల్ సమస్య.. నిలిచిన టేకాఫ్

by Kema Shiva Kumar |

ఎయిరిండియా (Air India) విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైట్‌లో టెక్నికల్ సమస్య.. నిలిచిన టేకాఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా (Air India) విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. అహ్మదాబాద్ ప్రమాద ఘటనను గుర్తు చేసేకుంటూ జనం భయభయంగా ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ఢిల్లీ (Delhi)లోని ఇందిరా‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 160 మంది ప్రయాణికులతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ముంబై (Mumbai)‌లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే టేకాఫ్‌కు ముందు పైలెట్లు ఇంజిన్‌లో సాంకేతిక సమస్యను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికులను ముంబైకి తరలించేందుకు ఆల్టర్‌నేట్ ఫ్లైట్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే, విమానం ఇంజిన్‌లో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు టెక్నికల్ టీమ్‌ రానుందని ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి.

Next Story