Air accidents: ఈ ఏడాది ఎనిమిది విమాన ప్రమాదాలు.. లోక్‌సభలో కేంద్రం వెల్లడి

by B.Srinivas |

ఈ ఏడాది ఇప్పటి వరకు దేశంలో ఎనిమిది విమాన ప్రమాదాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్ సభలో వెల్లడించింది.

Air accidents: ఈ ఏడాది ఎనిమిది విమాన ప్రమాదాలు.. లోక్‌సభలో కేంద్రం వెల్లడి
X

దిశ. నేషనల్ బ్యూరో: ఈ ఏడాది ఇప్పటి వరకు దేశంలో ఎనిమిది విమాన ప్రమాదాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్ సభలో వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో 274 మంది మరణించారని తెలిపింది. ఈ ప్రమాదాలకు గల కారణాలపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ (Muralidhar mehole) లిఖిత పూర్వకంగా తెలిపారు. ఎనిమిది ప్రమాదాల్లో 84 మంది గాయపడగా అందులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలోనే 81 మంది గాయపడ్డారు. 2015 నుంచి ఇప్పటి వరకు భారతీయ పౌర రిజిస్టర్డ్ షెడ్యూల్డ్ విమానాలకు సంబంధించిన మొత్తం 18 ప్రమాదాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వ్యక్తులకు క్యారేజ్ బై ఎయిర్ యాక్ట్, 1972 నిబంధనల ప్రకారం ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, జూన్ 12 జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Next Story