బిహార్‌లో 19 శాతం ఉన్న ముస్లింలకు లీడర్ అవసరం: అసదుద్దీన్ ఓవైసీ

by Phanindra |

బిహార్‌లో 19 శాతం ముస్లింలు ఉన్నారని, కానీ వారికి నాయకలు లేరని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇక్కడ ముస్లి లీడర్లు ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

బిహార్‌లో 19 శాతం ఉన్న ముస్లింలకు లీడర్ అవసరం: అసదుద్దీన్ ఓవైసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే నేత లేడని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బిహార్ ఎన్నికల దగ్గర పడిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకులున్నారని, కానీ ముస్లింలకు మాత్రం లేరని ఓవైసీ చెప్పారు. ‘యాదవులు, పాశ్వాన్‌లు, ఠాకూర్‌లు.. ఇలా అన్ని కమ్యూనిటీలకు వాళ్ల లీడర్లున్నారు. కానీ 19 శాతం ఉన్న ముస్లింలకు మాత్రం బిహార్‌లో నాయకులు లేరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కావున ఇక్కడ ముస్లిం లీడర్లు ఎదగాల్సిన అవసరం చాలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2022 కులగణన ప్రకారం బిహార్‌లో 17.7 శాతం ముస్లిం జనాభా ఉంది.

కాగా, 2020 బిహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు ఏఐఎంఐఎం అభ్యర్థులే గెలిచారు. అయితే వారిలో నలుగురు ఆ తర్వాత ఆర్జేడీలో కలిసిపోయారు. ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. దీనికోసం తమకు ఆరు సీట్లిస్తే విపక్ష కూటమిలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఓవైసీ గతంలోనే ప్రకటించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలకు ఈ విషయంలో లేఖలు రాసినా ఎలాంటి సమాధానం రాలేదని కూడా వెల్లడించారు.

Next Story