- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోక్సో కేసుల్లో కన్సెంట్ వయసును 16 ఏళ్లకు తగ్గించాలి!
పోక్సో కేసుల్లో కన్సెంట్ వయసును 16 ఏళ్లకు తగ్గించాలి. సుప్రీంకోర్టుకు తెలిపిన అడ్వొకేట్ ఇందిరా జైసింగ్.

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టులో పోక్సో కేసుల్లో వయసు పరిమితిని తగ్గించడంపై సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్ కీలకమైన డిమాండ్ చేశారు. నిపున్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టుకు సహకరిస్తున్న జైసింగ్.. ఐపీసీ సెక్షన్ 375 , పోక్సో కేసుల్లో సెక్సువల్ కన్సెంట్ వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కోరారు.
18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారితో శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని క్రిమినల్ చర్యగా భావించి, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ఇలా చేయడం యుక్తవయసు యువతీయువకుల హక్కులను ఉల్లంఘించడమేనని ఇందిరా తెలిపారు. ‘యువతీయువకుల మెచ్యూరిటీ, స్వయంప్రతిపత్తిని పట్టించుకోని ప్రస్తుత న్యాయవ్యవస్థ ఇలా అంగీకారంతో జరిగే శారీరక సంబంధాన్ని నేరంగా పరిగణిస్తుంది.
ఈ కన్సెంట్ వయసును 16 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు ఎందుకు పెంచాల్సిన అవసరాన్ని సమర్థించే ఎలాంటి డేటా లేదు’ అని ఆమె చెప్పారు. 70 ఏళ్ల వరకు ఈ కన్సెంట్ వయసు 16 ఏళ్లుగానే ఉండేది. దీన్ని 2013లో క్రిమినల్ లా (సవరణ) చట్టంలో 18 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ఎలాంటి చర్చలు జరగలేదని, జస్టిస్ వర్మ కమిటీ ప్రతిపాదనలను కూడా ఉల్లంఘించిందని ఇందిర తెలిపారు.






