రైల్వేస్టేషన్ టీవీల్లో పోర్న్ వీడియో.. ప్రయాణికుల రియాక్షన్ ఇదే!

by Disha Web Desk 2 |
రైల్వేస్టేషన్ టీవీల్లో పోర్న్ వీడియో.. ప్రయాణికుల రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైల్వేస్టేషన్లో ప్రయాణికులంతా రైలు కోసం వేచిచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో మరికొంత మంది తాము ఎక్కాల్సిన రైలు వచ్చిందంటూ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. మరికొందరు మాత్రం తమ రైలు వచ్చేదెప్పుడో తెలియక గంటల తరబడి ప్లాట్‌ఫామ్‌పై ఉండే టీవీలను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వారు ఊహించని వీడియో ఒకటి టీవీలో ప్లే అయింది. అంతే.. అందరూ ముఖాలు తిప్పేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లోని ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో రైల్వేస్టేషన్‌లోని 10వ నంబరు ఫ్లాట్‌ఫాంపై ఉండే టీవీల్లో పోర్న్ వీడియోలు ప్రసారమయ్యాయి. ఏకంగా 3 నిమిషాల పాటు ఈ పోర్న్ వీడియో ప్రసారం కావడంతో ప్రయాణికులంతా విస్తుపోయారు. ‘ఛీ ఛీ’ అంటూ ముఖాలు చాటేశారు. ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడ్డారు. వెంటనే తేరుకున్న అధికారులు ఆ వీడియో ప్రసారాలను నిలిపివేశారు. ఈ వీడియోలను చూసిన కొందరు గవర్నమెంట్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ పోర్న్ వీడియో ప్రసారాలను నిలిపివేశారు. దీనిపై రైల్వే స్టేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. టీవీలను ఏర్పాటు చేసిన దత్తా కమ్యూనికేషన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు అపరాధం కూడా విధించారు. ఆ సంస్థతో ఉన్న కాంట్రాక్టును కూడా రైల్వే శాఖ రద్దు చేసింది. పైగా, ఈ ఘటనపై రైల్వే శాఖ కూడా దర్యాప్తు చేపట్టింది.

ఇవి కూడా చదవండి : ఖైదీలకు మెగా ఆఫర్.. వేశ్యను పెళ్లి చేసుకుంటే జైలు నుంచి రిలీజ్


Next Story

Most Viewed